Home  »  TV News  »  జ్యోత్స్న ఆత్మహత్యాయత్నం.. గన్ గురిపెట్టి కార్తీక్‌ను పెళ్లి చేసుకోమని బెదిరింపు!

Updated : Apr 12, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 (Karthika Deepam2)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-642లో.. కార్తీక్, దీపల పెళ్ళిరోజున వాళ్ళిద్దరిని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. కార్తీక్ ని గుడికి తీసుకెళ్ళమని చెప్తుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ తప్పక తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఇక అక్కడికి వెళ్ళి వస్తుంటే దారిలో ఆగమని చెప్తుంది జ్యోత్స్న. తన ప్లాన్ ప్రకారం తాళి బయటకి తీసి తనని పెళ్లి చేసుకోమని కార్తీక్ తో చెప్తుంది జ్యోత్స్న. ఎందుకిలా చేస్తున్నావ్.. నాకు పెళ్ళి అయిందని కార్తీక్ అంటాడు. అయినా సరే నన్ను పెళ్లి చేసుకో.. లేదంటే ఈ గన్ తో కాల్చుకుంటానని జ్యోత్స్న బెదిరిస్తుంది. దానికి కార్తీక్ నిరాకరిస్తాడు.

ఇక జ్యోత్స్న రెచ్చిపోతుంది. మూడు లెక్కపెట్టేలోపు ఈ తాళిని నా మెడలో కట్టు లేదంటే కాల్చుకొని చస్తానని జ్యోత్స్న అనగానే కార్తీక్ వద్దని టెన్షన్ పడతాడు. ఒకటి, రెండు, మూడు లెక్కపెట్టగానే గన్ పేలిన శబ్దం వినిపిస్తుంది. మరోవైపు కాశీ కార్ క్లీన్ చేస్తుంటాడు. అప్పుడే స్వప్న కాఫీ తాగుతూ ఏదో ఒక నవల చదువుకుంటూ బయటకు వస్తుంది. కాశీని చూసి లోపలికి వెళ్ళాలనుకుంటుంది కానీ మళ్ళీ బయటకి వచ్చి కూర్చుంటుంది. ఇక కావేరీ అల్లుడు కాఫీ తీసుకొచ్చానంటూ వస్తుంది. సరే అత్తయ్య కార్  క్లీన్ చేసాక తాగుతానని అంటాడు. కాఫీ చల్లారేలోపే తాగమని గుమ్మం దగ్గర పెట్టేసి వెళ్ళిపోతుంది కావేరి. కాసేపటికి కాశీ వచ్చి కాఫీ తాగుతుంటాడు‌. హాయ్ స్వప్న అని కాశీ అనగా హాయ్ అని స్వప్న అంటుంది. భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి వాటిని సరిదిద్దుకోవాలంటూ కాశీ మాట్లాడుతుంటాడు. నమ్మకం లేని చోట బంధం నిలబడదు అంటూ స్వప్న మాట్లాడుతుంది. కాసేపటికి వాళ్ళింటికి కొత్త పెళ్లి కొడుకు ధీరజ్ వస్తాడు. స్వప్న కోసం గాజులు తీసుకొస్తాడు. అవి తన చేత్తో వేయాలని ధీరజ్ అనగా ఈ రోజు మంచిరోజు కాదని స్వప్న అంటుంది. దాంతో సరే నీ ఇష్టమని చెప్పి ధీరజ్ వెళ్ళిపోతాడు.

మరోవైపు శివన్నారాయణ, దశరథ్, సుమిత్ర మాట్లాడుకుంటారు. కార్తీక్, దీపల పెళ్ళి రోజున కార్తీక్ ని జ్యోత్స్న ఎందుకు తీసుకెళ్ళిందని శివన్నారాయణ అంటాడు. ఏదో ప్లాన్ చేసినట్టుందని దశరథ్ మనసులో అనుకుంటాడు. కానీ బయటకి ఏమో తెలియదు నాన్న అని అంటాడు. ఇక కాంచన, దీప మాట్లాడుకుంటారు. ఈ జ్యోత్స్న ఎప్పుడు చూసిన ఇలానే చేస్తుంది.. కార్తీక్ ని ఇంటికి రమ్మని చెప్పు.. భార్యభర్తలు సరదాగా ఉండాలి కదా అని కాంచన తిడుతుంటే దీప కాల్ చేస్తుంది.

ఇక జ్యోత్స్న గన్ తో కాల్చుకోబోతుంటే దానిని పక్కకి విసిరేస్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ కి దీప కాల్ చేస్తుంది. ఇక ఆ ఫోన్ ని జ్యోత్స్న లాక్కొని మాట్లాడుతుంది. బావని ఇంటికి పంపించు అని దీప అనగానే నా బావ అని జ్యోత్స్న అంటుంది. అసలు ఆడదానివేనా అని దీప అనగానే బావతో నా పెళ్ళి చేస్తే ఎప్పుడో తెలిసేదని  జ్యోత్స్న అంటుంది. నన్ను రెచ్చగొట్టకు అని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్ ఫోన్ తీసుకొని కాల్ కట్ చేస్తాడు. దీపకి  ఏం తెలియదని కార్తీక్ అనగానే నీతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయని జ్యోత్స్న అంటుంది. నాకేం లేవు.. పదా నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను.. నిన్ను సేఫ్ గా ఇంటి దగ్గర వదిలిపెడతానని అత్తకి మాటిచ్చానంటూ జ్యోత్స్నని కార్ లోకి బలవంతంగా లాక్కెళతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.